ఈనెల 30న సద్దుల బతుకమ్మ... ప్రభుత్వం కీలక నిర్ణయం

 

రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి.

తెలుసుకున్నట్లుగా, ఈ నెల 21వ తేదీ ఆదివారం చిన్న బతుకమ్మ జరుపుకున్నారు. సాధారణంగా చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ మధ్య తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన 29వ తేదీ సోమవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని కొందరు భావించగా, మరికొందరు 30వ తేదీ మంగళవారం జరుపుకోవాలని సూచించారు. పూజారులు కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక మరోవైపు, అక్టోబర్ 2న దసరా పండుగ జరుపుకోనున్నారు. అయితే అదే రోజు గాంధీ జయంతి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం నిషేధం అమలులో ఉండనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu