బ్రహ్మెత్సవాలలో 23.50 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ
posted on Oct 1, 2025 12:37PM

తిరుమల ఆకలి అన్న పదమే వినపడని పుణ్యక్షేత్రం. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన అన్న ప్రసాదాన్ని అందుబాటులో ఉంటుతోంది. ఇప్పుడు ఆ ఆన్న ప్రసాద కార్యక్రమాన్ని మరింత విస్తరించింది. తిరుమలలో ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకూ దాదాపు 23 లక్షల50 వేల మందికి ఎటువంటి కొరతా లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసింది. గత ఏడాది బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసింది.
టీటీడీ. యాత్రికుల రద్దీని అంచనా వేసి, 16 రకాల పదార్థాలతో నాణ్యమైన అన్నప్రసాదాలు పంపిణీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, పీఏసీ - 2, పీఏసీ 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకూ బయటి క్యూలైన్ల వరకు నిత్యం అన్నప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మెవ్సాల్లో కూడా ఈ నెల 24వ తేదీ నుంచి మంగళవారం వరకు 23,48,337 మంది యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసిన తిరమల తిరుపతి దేవస్థానం కొత్త రికార్డు సృష్టించింది.
అన్నప్రసాదాల పంపిణీపై 99 శాతం మంది యాత్రికుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. సాధారణంగా కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనంతో పాటు మలయప్ప స్వామి వారి వాహన సేవలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఈ సారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్యాలరీల్లో యాత్రికులకు సేవలు అందించడానికి టీటీడీ సిబ్బందితో పాటు 3,500 మంది శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు వినియోగించుకుంది. దాతలు అందించిన 23 రకాల కూర గాయలతో ఆహార పదార్థాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు.
"బ్రహ్మత్సవాల్లో ఈ 24వ తేదీ నుంచి 29వ తేది వరకు 23,48,337 మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించినట్లు టీటీడీ తెలిపింది. 11,32,160 మంది భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీటి బాటిళ్లు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రహ్మెత్సవాలలో అత్యంత రద్దీగా ఉండే గరుడ వాహన సేవ రోజున తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అందుకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంది. రెండు లక్షల మందంికి సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసింది. విశేషమైన గరుడ వాహన సేవ రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాలరీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వద్ద 9,28,000 మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసింది.