విహారం.. వినోదం.. విషాదం

విహారయాత్ర మహా విషాదంగా మారింది. వెకేషన్ వచ్చిందంటే చాలు యువత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి విహారయాత్రలకు వెళ్లడం అన్నది సహజం అయితే కొన్ని సార్లు ఆ విహార యాత్రలు విషాదంగా ముగియడం కద్దు. గతంలో కూడా పలుమార్లు విహార యాత్రలు విషాదాంతమైన ఘటనలు ఉన్నాయి. అటువంటిదే తాజాగా నల్లొండ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన చాణక్య అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి సాగర్ ఆంజనేయ స్వామి పుష్కర్ ఘాట్ కు వెళ్లాడు.

దైవ దర్శనం తరువాత స్నేహితులంతా కలిసి పుష్కర్ ఘాట్ వద్ద ఫొటోలు తీసుకుంటుండగా చాణక్య ప్రమాద వశాత్తూ నదిలో పడిపోయాడు. అతడి రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాణక్య ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.  దీంతో స్నేహితులు  పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం బృందం ఘటన స్థలానికి చేరుకొని చాణక్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu