బీఆర్ నాయుడితో టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు బేటీ!

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నేడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న శ్యామలరావును ప్రభుత్వం జీఏడీ ప్రధాన కార్యదర్శిగా బదలీ చేసింది. శ్యామలరావు బదలీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో ఆయనకు ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. బీఆర్ నాయుడితో శ్యామలరావు విభేదాలు    తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి.

అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు.  అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన  సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది.

దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.  అయితే టీటీడీ ఈవోగా రిలీవ్ అయిన తరువాత శ్యామలరావు బుధవారం (సెప్టెంబర్ 10) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈవోగా తన పదవీ కాలంలో బీఆర్ నాయుడు అందించిన సహకారానికి కృతజ్ణతలు తెలిపారు. అలాగే బీఆర్ నాయుడు శ్యామలరావును శాలువతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ణాపికగా అందించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu