ఫిలింనగర్ భూ వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు

 

జూబ్లీహిల్స్ లోని దక్కన్ కిచెన్ వ్యవహారం ఎటు తేలడం  లేదు.. దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన ఈ కిచెన్ వ్యవహారం పైన కోర్టులో సుదీర్ఘంగా నడుస్తుంది.. దక్కన్ కిచెన్ లోకి అక్రమంగా చొరబడి తమని మోసం చేశారని చెప్పి నందకుమార్ పైన హీరో వెంకటేష్ ,సురేష్ బాబులు పిర్యాదు చేశారు.. సురేష్ బాబు స్థలంలోకి ఉన్న దక్కన్ కిచెన్ ని అధికారులు కూల్చివేసి నందకుమార్‌ను పంపించివేసి స్థలాన్ని దగ్గుబాటి కుటుంబానికి అప్పగించారు. 

దక్కన్ కిచెన్ వ్యవహారంలో తాను తీవ్ర స్థాయి లో నష్టపోయానని, తనకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండా నిర్మాణాలను కూల్చి వేసి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారని హీరో వెంకటేష్ , సురేష్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు.. గతంలో దక్కన్ హోటల్ కూల్చి వేసిన విషయం తెలిసిందే... అయితే నందకుమార్ దక్కన్ హోటల్ నడుపుతున్నాడు.  నందకుమార్ ను   ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు ..కానీ నందకుమార్ కోర్టును ఆశ్రయిం చాడు. అయితే అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా సురేష్ బాబు కొంతమంది అధికారులతో కలిసి దక్కన్ హోటల్ కూల్చివేశారు. 

దీంతో నందకుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెరకు కోర్టులో విచారణ కొనసా గుతున్నది.. అయితే నందకు మార్ గత 18 నెలలుగా తాను కోర్టులో పోరాడు తున్నానని, తన హోటల్ ను అన్యా యంగా కూల్చివేశారని... నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను అప్రూవర్గ మారినందుకే నా మీద 12 అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు... కోర్టు ఎన్ని మార్లు చెప్పినా కూడా సురేష్ బాబు, వెంకటేష్  కోర్టు కు హాజరు కావడం లేదు.

అంతేకాకుండా సురేష్ బాబు అతని కుటుంబ సభ్యులు కోర్టు విచారణకు రాకుండా కేసును విత్‌డ్రా చేసుకోక పోతే నన్ను చంపే స్తానని బెదిరింపు లకు గురి చేస్తున్నా రని నందకుమార్ వాపోయాడు. ఇప్పటికే కోర్టు సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ లను కోర్టు కు రావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది ..అప్పుడు హీరో వెంకటేష్ తో పాటు సురేష్ బాబులు రాని పక్షంలో చర్యలకు ఆదేశాలు ఇస్తామని కోర్టు హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu