తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

 

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ సహ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. హైదరాబాద్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని నంద్యాల, వైజాగ్, అనకాపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu