తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
posted on Oct 5, 2025 10:34AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ల లేని భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 83,380 మంది స్వామివారిని దర్శించుకోగా 32,275 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సీఎం చంద్రబాబు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం నా అదృష్టమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారు. భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో తెలిపారు