శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
posted on Sep 24, 2025 7:56PM
.webp)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.
తిరుమల గాయత్రి నిలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 25న ఉదయం 9.10కి వెంకటాద్రి నిలయానికి చేరుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితరాలను ప్రారంభిస్తారు. 9.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అనంతరం 10.40కి తిరుగు ప్రయాణమవుతారు.