ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు
posted on Sep 24, 2025 7:27PM

తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కూతురుపై ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు కారులో వచ్చి కూతురిని కిడ్నాప్ చేసి తీసు కువెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని నర్సంపల్లి గ్రామంలో నివాస ముంటున్న శ్వేత అనే యువతి, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువ కుడ్ని ప్రేమించింది. కానీ వీరి ప్రేమను శ్వేత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమ జంట పెద్దల్ని ఎదిరించి గత నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.
కూతురు తమకు నచ్చని వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు కోపంతో రగిలిపో యారు. ఎలాగైనా సరే తన కూతుర్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు బుధవారం తెల్లవారుజామున శ్వేత తల్లిదండ్రులు వారి బంధువుల సహాయంతో కూతురు అత్తవా రింటికి వెళ్లి ప్రవీణ్ పై దాడి చేయడమే కాకుండా శ్వేత కళ్ళులో కారం చల్లి... కండ్లకు బట్టకట్టి కొట్టు కుంటూ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసు కెళ్లారు.
అయితే ఈ ఘటనకు సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి.. అనంతరం ప్రవీణ్ తన భార్యను కిడ్నాప్ చేశారని కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.