విజయవాడ ఉత్సవ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
posted on Sep 23, 2025 3:07PM

శరన్నవరాత్రులను పురస్కరించుకుని బెజవాడలో దసరా ఉత్సవ్ నిర్వమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మైసూరు ఉత్సవాలను తలదన్నేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలలని తలపెట్టింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసింది. అయితే ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంపిక చేసిన స్థలాలలో ఒకటి దుర్గగుడికి చెందినదని పేర్కొంటూ ఆలయ భూమిలో వ్యాపార కార్యక్రమాల నిర్వహణ ఏమిటంటూ వైసీపీ సీనియర్వి నేత పేర్నినాని విమర్శలు గుప్పించారు.
ఆయన విమర్శలను ఆధారం చేసుకుని కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు సింగిల్ బెంచ్ ఆలయభూమిలో వ్యాపార కార్యక్రమాలను వీల్లేదంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
ఆ పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించి విజయవాడ ఉత్సవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉత్సవాల నిర్వహణను నిలిపివేయాలంటూ కొన్ని సంఘాల దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో విజయవాడ ఉత్సవ్ కు అడ్డంకులు తొలగిపోయాయి.