స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌

 

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టుకు చేరింది.  రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సెప్టెంబరు 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 6న పిటిషన్‌పై విచారణ జరపనుంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. 

రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును పొందుపరిచారు. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై 8న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొన్నాది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu