వన్డే కెప్టెన్సీ నుంచి...రోహిత్ ఔట్!
posted on Oct 4, 2025 6:08PM

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. ఒక సమయంలో ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికలపై ఫైర్ అవుతున్నారు. కారణం 2023 వన్డే వరల్డ్ కప్ రోహిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు కోల్పోయాక.. ఎలాగైనా సరే ఆయన సారధ్యంలోని భారత జట్టు ఈ సారిక కప్పు కొల్లగొట్టాలన్నది ఫ్యాన్స్ డిజైర్, డ్రీమ్, డెస్టినీ, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను ఇంగ్లండ్‌తో జరిగిన పీటర్సన్- టెండూల్కర్ సీరీస్ డ్రా చేసిన గిల్ కి అప్పగించారు.
ఏది ఏమైనా.. రోకో జంట(రోహిత్- కోహ్లీ) ద్వారా వరల్డ్ కప్ అందుకోవాలన్నది అభిమానుల చిరకాల కోరిక. ఈ కల నెరవేరకుండానే.. బీసీసీఐ రోహిత్ శర్మ కెప్టెన్సీ పై వేటు వేయడం ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటికీ రోహిత్ ఈ మధ్య తాను అత్యంత కష్టమైన ఫిట్ నెస్ టెస్టు సైతం పాసయ్యారు. ఈ క్రమంలో ఆయనే వన్డే కెప్టెన్ అనుకున్నారంతా. ఈలోగానే భారత్ క్రికెట్ బోర్డు.. రోహిత్ ను సారధ్య బాధ్యతల నుంచి తప్పించడంతో.. ఇదీ పరిస్థితి. ఏది ఏమైనా బీసీసీఐ చెప్పక చెప్పిన విషయమేంటంటే.. రోహిత్ శర్మ కెరీర్ దాదాపు ముగిసిందని. ఈ లెక్కన రోహిత్ మ్యాజికల్ ఇన్నింగ్స్ ఇకపై మనం చూడ్డం ఒకరకంగా చెబితే, అసాధ్యం.
ఒక వేళ ప్లేయర్ గా ఆయన ఏదైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడితే దాంతో సరిపుచ్చుకోవల్సిందే తప్ప.. వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. బ్యాడ్ లక్ ఫ్యాన్స్. యువర్ ఆల్ టైం గ్రేట్ కెప్టెన్సీ ఇక దాదాపు కనుమరుగే.రోహిత్ ఆల్ టైం గ్రేట్స్ లో ఒకరిగా ఎందుకంటారంటే.. మనకు వరల్డ్ కప్పులు అందించిన కెప్టెన్లు ముగ్గురే ముగ్గురు. వారు ఒకరు కపిల్ కాగా, మరొకరు ధోనీ. ఇక మూడో కెప్టెన్ గా వీరి సరసన నిలిచిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే. వన్డే వరల్డ్ కప్ తృటిలో చేజారినా.. ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ అయితే సాధించి భారతీయుల మనససు చూరగొన్నాడు రోహిత్. ఇకపై అభిమానులు ఆ స్థాయి విధ్వంసకర ఓపెనింగ్ స్టైల్ ని అభిషేక్ లో చూసుకోవల్సిందేనని నిరాశ వ్యక్తం చేస్తోంది యావత్ క్రికట్ ప్రేమికుల ప్రపంచం.