అంగరంగ వైభవంగా.. కన్నుల పండువగా రథోత్సవం
posted on Oct 1, 2025 3:23PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోరోజైన బుధవారం (అక్టోబర్ 1) ఉదయం శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.