బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు
posted on Oct 1, 2025 3:29PM

రంగారెడ్డి జిల్లా మాదన్నపేట్ పరిధిలో నిన్న ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం దాడి చేసిన ఘటన మరువక ముందే మరొ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న తప్పిదంతో పెద్దగా రాద్ధాంతం చేస్తూ కానిస్టేబుల్ కుటుంబం నడిరోడ్డు మీద రచ్చ రచ్చ సృష్టించారు.. దీంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉదృత వాతావరణం నెలకొంది... హైదరాబాద్ నుండి నల్గొండ కి వస్తున్న ఆర్టీసీ బస్ క్లాక్ టవర్ సెంటర్ వద్ద TS05FM0405 గల కారును అను కోకుండా తగిలింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న విజిలెన్స్ కానిస్టే బుల్ భార్య మరియు సుపు త్రుడు ఈ విష యాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తూ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. బస్సు డ్రైవర్ ను చితకబాదుతున్న సమయంలో అక్కడే ఉన్న భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ వృత్తిపరం గా ఆ దృశ్యం మొత్తం వీడియో తీశాడు.. అది గమనించిన కానిస్టేబుల్ భార్య మరియు సుపు త్రుడు ఒక్కసారిగా రెచ్చిపోతూ భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ పై అసభ్యకరంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం.... పెద్దపెద్ద పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు.... మమ్ము లను ఏమీ చేయలేరు... నీ దిక్కున్న చోట చెప్పుకో.... అంటూ జర్నలిస్ట్ ని దుర్భా షలాడారు... అది గమనించిన భవాని భక్తులకు ఆగ్రహం వచ్చింది. వెంటనే భవాని స్వాములు అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కుటుంబం పై ఫిర్యాదు చేశారు.
భవాని మాల వేసుకున్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని అట్టి విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబం పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ భవాని స్వాములు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు దీంతో టూ టౌన్ ఎస్ఐ సైదులు ఇరుపక్షాల నుండి ఫిర్యాదులు స్వీకరించి.... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.