పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాల్

 

పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాలు విసిరింది. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపా యల నష్టాన్ని కలిగించిన ఐబొమ్మ యాజ మాన్యం పోలీసులను బెదిరిస్తూ ప్రకటనలు గుప్పిస్తుంది.. సినిమా ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ కోసం పనిచేస్తున్న నిర్వాహకులను పట్టుకుని ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తా ఉంటూ పోలీసులు ప్రకటించారు. 

గత వారంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఐ బొమ్మ చేసిన ప్రకటన చేరింది.. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఐబొమ్మకు సంబంధించిన నలుగురు నిర్వాహకులను పట్టుకున్నారు.. ఇందులో ప్రధాన సూతదారుడు విదేశాల్లో ఉన్నాడు.. సర్వర్స్ కూడా విదేశాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహ కులను ఎలాగైనా పట్టుకొని తీరుతా మంటూ పోలీసులు ప్రకటించారు..  సినిమా, ఓటిటి పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల ధియేటర్ లో రికార్డ్ చేసే వారితో పాటు... సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు..

అయితే పోలీసులుదర్యాప్తు చేస్తున్న క్రమంలో ఐబొమ్మ వెబ్‌ సైట్ పై దృష్టి సారించారు.. ఐ బొమ్మ...ఇప్పుడు తాజాగా ఐపిలు మార్చి పోలీసులను ఏమారుస్తున్నారు. ఐబొమ్మ సర్వర్, నేరగాళ్లను పట్టు కునే సమ యంలో తమను చేతనైతే పట్టుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఐబోమ్మ సవాల్ విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాల్ ను సైబర్ క్రైమ్ పోలీ సులు చాలెంజ్ గా తీసుకుని ఐబొమ్మ సైట్ కోసం పని చేస్తున్న 4గురిని అదుపులోకి తీసు కున్నారు.బీహార్, యూపిలో ప్రధాన ఏజెంట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తిం చారు.ఐ బొమ్మ దేశ వ్యాప్తంగా ఏజెంట్ల ను నియమిం చుకొని పెద్ద ఎత్తున పైరసీలకు పాల్ప డుతున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌,ఓటిటి కంటెంట్ తస్కరిస్తూ నిర్వహకులకు తల నొప్పిగా మారింది...

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ మరోసారి సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనే ప్రయ త్నాలు చేస్తే ఘోర పరిణామాలు తప్ప వని పోలీ సులు, మీడియా, ఓటీటీ సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీని హెచ్చరించింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతూ వైరల్ అవుతుంది.. అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఐ బొమ్మ వెబ్సైట్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. ఐ బొమ్మ విడుదల చేసిన ప్రకటనలో“మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతాం.మా టెలిగ్రామ్‌ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తామంటూ హెచ్చరించింది.

5 కోట్ల మందికి పైగా యూజర్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉందని అది కనుక విడుదల చేసై మీడియా, ఓటీటీ , హీరోలకూ షాకింగ్ రివీల్ అవుతుంది.ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము కూడా అక్కడే ఫోకస్ చేస్తాం.ఇండియా మొత్తం మా సపోర్ట్ గా ఉంది.మా సర్వర్లు ఎక్కడు న్నాయో పోలీసు లకు కనబడరు

ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్‌లో ఉంది.మా మీద నిఘా పెట్టితే ....ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటపడతాయి.మమ్మల్ని ఆప లేరు… మమ్మల్ని వెతకాలేరు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. పోలీసుల చర్యలతో బిగ్‌ స్టార్‌ల ఇమేజ్‌ ప్రమాదంలో పడుతుంది. మేము ఒక్క దేశానికి పరిమితం కాదు, గ్లోబల్‌ నెట్‌వర్క్‌” అని క్లారిటీ ఇచ్చింది.

తద్వారా, ఇండస్ట్రీలో పెద్ద షాక్ రాబోతుం దంటూ ఐబొమ్మ సవాలు విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాళ్లను చాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ సెట్ కోసం పనిచేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అనంతరం  గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సినిమా పైరసీ పై సినీ ప్రముఖులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు... ఈ సమావేశంలో ప్రముఖ హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. థియేటర్లో రహస్య చిత్రీకరణ డిజిటల్ హ్యాకింగ్ నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నారు... సినిమా ఒరిజినల్ కంటెంట్ ను కాపీ చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు... వెబ్సైట్లో రెగ్యులర్ ఆడిట్లు, యాక్సిస్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu