పందెం కోడి.. పరుగో పరుగు!
posted on Oct 15, 2025 9:59AM
.webp)
అన్నమయ్య జిల్లాలో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలపై పోలీసులు డ్రోన్లతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వమని, వాటిని సహించేది లేదనీ, ఉక్కుపాదంతో అణచివేస్తామని జల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు.
జిల్లాలో రహస్యంగా కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్లతో నిఘా పెట్టడం ద్వారా పక్కా సమాచారంతో కొండల్లో జరుగుతున్న కోడి పందాలపై మెరుపుదాడి నిర్వహించారు.
కొడి పందెం నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా 18 ద్విచక్రవాహనాలు, 24 వేల 200 రూపాయల నగదు, అలాగే పందాలకు సిద్ధం చేసిన 15 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు మెరుపుదాడి నిర్వహించిన సమయంలో పలాయనం చిత్తగించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.