హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పరార్
posted on Sep 23, 2025 3:21PM

హైదరాబాద్ ప్రిజం పబ్ ఫైరింగ్ కేసులో నిందితుడు పారిపోయాడు.. ఆంధ్ర పోలీసుల కస్టడీ నుంచి బత్తుల ప్రభాకర్ తప్పించుకొని పోయాడు.. హైదరాబాద్ నుంచి పిటి వారింటిపై తీసుకెళ్లి విజయవాడ కోర్టులో హాజరు పరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళుతుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైన బత్తుల ప్రభాకర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.. హైదరాబాదు నగ రంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రిజం పబ్ లో బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపి నానా హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే రాజ మహేంద్రవరం పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి పిటి వారంటి మీద ఈ బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసు కొని రాజమండ్రి కి తీసుకెళ్లారు అనంతరం నిన్న సోమవారం రాత్రి సమయంలో విజయవాడ కోర్టులో బత్తుల ప్రభాకర్ను హాజరు పరిచి తిరిగి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని వెళ్తుండగా... తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో ఉన్న ఒక దాబాలో విందు కోసమని పోలీసులు వాహనాన్ని ఆపారు
అదే అదనుగా భావిం చిన నిందితుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్ళు కప్పి అక్కడి నుండి పారిపో యాడని పోలీసులు తెలి పారు. ప్రభాకర్ ఒక చేతిలో సంకెళ్లు వేసి ఉన్నాయి .. తెల్లటి టీ షర్టు మరియు నల్ల ట్రాక్ ధరించి ఉన్నాడని పోలీ సులు తెలి పారు. ఈ కరుడు గట్టిన నేరస్థుడు తప్పించు కొని పారిపోవడం వల్ల ప్రజలు అప్రమ త్తం గా ఉండాలని రాజమహేంద్రవరం పోలీసులు కోరారు.
ఎవరికైనా బత్తుల ప్రభాకర్ కనిపించి నచో 94407 96584 లేదా 9440 796624 కు ఈ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బత్తుల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైటెక్ దొంగగా పేరుగాంచిన బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండా లంటూ పోలీసులు సూచించారు..