విమానం గాలిలో ఉండగానే విండ్ షీల్డ్ కు పగుళ్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇటీవలి కాలంలో విమానాలలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో  జనం విమానయానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మధురై నుంచి ముంబై వెడుతున్న ఇండిగో విమానానికి తృటితో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు బతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే మధురై నుంచి ముంబై వెడుతున్న విమానం ముందు భాగంలో ఉండే అద్దానికి  (విండ్ షీల్డ్) పగుళ్లు ఏర్పడ్డాయి. విమానం ల్యాండ్ కావడానికి కొద్ది సేపటి ముందు జరిగిన ఈ ఘటనతో కంగుతిన్న పైలెట్ వెంటనే  విషయాన్ని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కు తెలియజేశాడు.

కాక్ పిట్ లోని ముందు అద్దానికి ఈ పగుళ్ల ఏర్పడ్డాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్  చేయడంతో పెను ప్రమాదం తప్పింది.  అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా బే నంబర్ 95 వద్దకు తరలించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ కారణంగా ముంబై నుంచి మధురై వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్ ను రద్దు చేశారు.  విమానం అద్దం ఎందుకు పగిలిందనే దానిపై  దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu