వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయి : గోరంట్ల

 

వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయని ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయిన ప్రతిపక్ష బాధ్యతను తాము తీసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. మెడికల్ కాలేజీల కోసం మాట్లాడితే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారని ధ్వజమెత్తారు. 

జగన్ అండ్ కో శాడిస్టు మనస్వత్వంతో వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పేదలకు రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని తెలిపారు. నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు అగ్ర హీరోలుని వైసీపీ హయంలో  టాలీవుడ్ నటులను అవమానించారనే అంశంపైనే అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. 

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకి జగన్ ఐదేళ్లపాటు బకాయిలు చెల్లించకపోతే.. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాలా తీసిందని విమర్శించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మెడికల్ కాలేజీలకు రూ.7,500 కోట్లు అవసరమైతే.. జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలను వైసీపీ పునాదుల్లోనే వదిలేసిందని  గోరంట్ల విమర్శించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu