ఆస్ట్రేలియాలో నారా లోకేష్ స్పీడ్.. పెట్టుబడుల వేటలో దూకుడు

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో ఆస్ట్రేలియాలో యమా బిజీగా ఉన్నారు. పెట్టుబడులతో పాటు.. అక్కడి సాంకేతికతను, విద్యా రంగంలో మెళకువలను రాష్ట్రానికి అందించేందుకు అవసరమైన అవగాహనా ఒప్పందాలను చేసుకోనేందుకు కూడా ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇందులో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా(యుటిఏఎస్)ను  మంత్రి నారా లోకేష్ సందర్శించారు.

అలాగే రాష్ట్రంలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్/ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేపట్టాలని, ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రామ్ మాదిరిగా ఆస్ట్రేలియా మా విద్యార్థుల ప్లేస్ మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను నిర్వహించాలని మంత్రి కోరారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్ ను బెంచ్ మార్కు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.

అదే విధంగా బ్రిటీష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్, హెడ్ ఎంటర్ ప్రైజెస్ ఇంటెలిజెన్స్ దినేష్ కంతేటిలతో భేటీ అయిన నారా లోకేష్  ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.  గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu