దుబాయ్ నుంచే అధికారులకు బాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పని రాక్షసుడన్న సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాలను విస్మరించరన్న సంగతీ తెలిసిందే. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాలలో ప్రాణనష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించడానికి ఆయన అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను జల ప్రళయంలా కమ్మేసిన సందర్భంలో ప్రాణనష్టం అతి స్వల్పంగా ఉండడానికి ఆయన తీసుకున్న ముందస్తు చర్యలే కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా, పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు దేశాలు చుట్టేస్తున్నారు.  యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు గురువారం (అక్టోబర్ 23) దుబాయ్ లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, మెరుపు వరదలు సంభవించే అవకాశాలపై వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ నుంచే అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాలలో పరిస్థితిపై చంద్రబాబు దుబాయ్ నుంచే మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు.

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి వంగలపూడ అనితను కూడా అప్రమత్తం చేశారు. అవసరమైన చర్యలు తీసుకుని ప్రాణనష్టాన్ని నివారించాలని ఆదేశించారు.  వర్ష ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆదేశించారు.  ప్రజలకు ఎుఠవంటి ఇబ్బందీ కలగకుండా, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సూచించిన చంద్రబాబు.. వర్ష ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలను ఏఱ్పాటు చేయాలని ఆదేశించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu