టీడీపీలోకి ''నల్లారి''..
posted on Apr 10, 2017 3:45PM

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీ లో చేరుతున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన బీజేపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సీపీలో చేరుతారని ఎప్పటినుండో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇటీవల నల్లారి సోదరుల తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల మేరకు కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలో చేరాలని వారు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు రాజంపేట ఎంపీ టికెట్ తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి తనకు కావాలని కిషోర్ కుమార్ రెడ్డి అడిగినట్టు తెలుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరి దీనిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.