పాకిస్థాన్ లో భారత్ రా ఏజెంట్ కు ఉరిశిక్ష...
posted on Apr 10, 2017 4:23PM

పాకిస్థాన్ లో భారత్ రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ కు ఉరిశిక్ష పడింది. భారత్ రా ఏజెంట్ కుల్‌భూషణ్ జాదవ్ పై గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో పాకిస్థాన్ లో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు. ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ కుల్‌భూషణ్‌ను విచారించి ఉరిశిక్ష వేసింది. గతేడాది మార్చిలో ఇరాన్ నుంచి బలూచిస్థాన్‌లోకి ప్రవేశించాడని జాదవ్‌ను అరెస్ట్ చేశారు. అతనో రా ఏజెంట్ అని, దేశంలో ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నాడని పాక్ ఆరోపించింది.
మరోవైపు దీనిపై భారత్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. జాదవ్‌ను బలూచిస్థాన్ నుంచి ఎత్తుకెళ్లి, తర్వాత అరెస్ట్ చేశారని విచారణ కూడా సరిగా జరగలేదని...పాక్‌లోని ఆర్మీ కోర్టులు ఉగ్రవాదుల విచారణ కోసం ఉన్నవి కానీ.. భారత జాతీయుల కోసం కాదు.. దీనిపై మేము నిరసన తెలుపుతున్నామని వెల్లండించింది. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.