వేలంలో మైహోం భూజా గణేషుడి లడ్డూ ధర అరకోటిపైనే!
posted on Sep 5, 2025 6:13AM
.webp)
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో వాడవాడలా గణేష్ మంటపాలను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా.. మండపాలలో కొలువై పూజలందుకున్న గణేషుడి లడ్డూల వేలం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడాన్ని భక్తులు ఒక ఘనతగా, ఎంతో గొప్పగా ఫీలౌతుంటారు. గత కొంత కాలం వరకూ గణేష్ లడ్డూ వేలం అంటూ బాలాపూర్ గణపతి లడ్డూ వేలం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచీ పలు మండపాలలో వేలంలో లడ్డూ ధరల లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది హైదరాబాద్ లోని మైహోం భూజా లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లడ్డూ వేలం ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులనూ తిరగరాసింది. రాయదుర్గంలోని మై హోమ్ భూజాలోని లడ్డూ వేలంలో అక్షరాలా 51లక్షల 77 వేల777 రూపాయలు పలికింది. ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి వేలం పాటలో ఈ ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు.