నెక్ట్స్ మూవీ హీరో ఎవరు? ఈ స్టార్ ఓకేనా మీకు
on Dec 16, 2025

-అఖండ 2 తో బోయపాటి పై మరింత బాధ్యత
-నెక్స్ట్ హీరో ఎవరు?
-సబ్జెట్ ఎలా ఉండబోతుంది
అఖండ 2(Akhanda 2)తో 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తన సత్తా చాటాడు. ఈ సారి ఏకంగా పాన్ ఇండియా లెవల్లో డేవోషనల్ సబ్జెట్ కి తన మార్క్ ని జోడించి చెప్పడంతో ఇప్పుడు బోయపాటి పేరు ఇండియా వైడ్ గా మారుమోగిపోతుంది. పైగా ఈ విజయం ఆషా మాషి విజయం కాదు. సెల్యులాయిడ్ పై తన బాధ్యత మరింత పెరగడంతో పాటు అప్ కమింగ్ సినిమాల సబ్జెట్స్ పై మరింత జాగ్రత్త వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నెక్స్ట్ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించాలి. అంటే పాన్ ఇండియా లెవల్లో పేరున్న హీరోనే తన సినిమాలో ఉండాలి. మరి మాములు కమర్షియల్ సబ్జెట్ ని ప్రేక్షకులు ఊహించరు. దీంతో అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో బోయపాటి నెక్స్ట్ మూవీ హీరో ఎవరు? సబ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది.
ఈ విషయంపై సినీ విశ్లేషకులు మాట్లాడుతు 'బోయపాటి నెక్స్ట్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో ఉండవచ్చు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమాలు లేవు. 'త్రివిక్రమ్' తో మైథలాజికల్ మూవీ అనుకున్నా అది మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్ వద్దకు చేరింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ బోయపాటి తో ఉండవచ్చు. అల్లు అర్జున్ ఒక ఫంక్షన్ లో బోయపాటి తో సినిమా చెయ్యాలని ఉందని తమ మనసులో మాట చెప్పాడు. డు. పైగా గీతా ఆర్ట్స్ నుంచి బోయపాటి ఐదు సంవత్సరాల క్రితమే అడ్వాన్సు తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ నే స్వయంగా చెప్పాడు. పైగా సినిమాలకి మించి అల్లు అర్జున్, బోయపాటి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో బోయపాటి నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో ఉంటుందని, సంక్రాంతి తర్వాత ఈ విషయంపై పూర్తి క్లారిటీ వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
also read: అఖండ 2 నుంచి 'గంగాధర శంకర' సాంగ్ రిలీజ్
కాకపోతే ఇక్కడ ఇంకో ఆసక్తి కర విషయాన్నీ కూడా సినీ పరిశీలకులు చెప్తు వస్తున్నారు. బోయపాటితో సినిమా చెయ్యాలని ఉందని అల్లు అర్జున్ ప్రకటించిన సందర్భంలో మంచి కమర్షియల్ సబ్జెట్ చెయ్యాలని ఉందనే మాట అన్నాడు. దీంతో అల్లు అర్జున్, బోయపాటి కాంబోలో వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సరైనోడు కి సీక్వెల్ ఉంటుందని ఒక రేంజ్ లోనే వార్తలు వచ్చాయి. పైగా ఆ మూవీ అల్లు అర్జున్ కి మాస్ లో సరికొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. దీంతో సరైనోడు సీక్వెల్ పక్కా అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరికి పాన్ ఇండియా లెవల్లో ఏర్పడిన క్రేజ్ ని బట్టి మాములు కమెర్షియల్ సబ్జెట్ చెయ్యడం అనేది డౌటే. ఈ విషయం ఆ ఇద్దరికి కూడా తెలుసనీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



