బీబీసీపై 90 వేల కోట్టకు ట్రంప్ పరువునష్టం దావా..
posted on Dec 16, 2025 9:39AM

ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి.. తాను చెప్పని మాటలను మాట్లాడినట్లుగా బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించిన ట్రంప్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. బీబీసీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు విఘాతమనిపేర్కొన్న ట్రంప్ బీబీసీపై 90 వేల కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు.
తాను ఎన్నడూ అనని ఎ మాటలను ఏఐ వినియోగించి.. తన నోట పలికినట్లు వినిపించి, చూపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి, తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. బీబీసీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందన్న ట్రంప్.. ఈ దావా వేశారు.