ఉసురు తీసిన పొగమంచు
posted on Dec 16, 2025 8:25AM
.webp)
ఒకదాని వెనుక ఒకటిగా వాహనాలు ఢీ కొనినలుగురు మృతి
పొగమంచు కమ్మేయడంతో విజిబులిటీ తగ్గిపోయి ఢిల్లీ-ఆగ్రారోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. దారి కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దుర్ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో పాతిక మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మథుర జిల్లా పరిధిలోని ఆగ్రా-నోయిడా మార్గంలో మంగళవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఒకదాని వెనుక ఒకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.