అగ్నివీర్ అరెస్ట్ . ముంబై నేవీకి చిక్కిన ఇద్దరు అగంతకులు

 

అతను ఒక అగ్ని వీర్.. నావి అగ్ని వీర్ గా సెలెక్ట్ అయ్యాడు.. ముంబై నేవీ ప్రధాన కేంద్రంలో పనిచేస్తు న్నాడు ..ఇటీవల కాలంలో అతన్ని ముంబై నుంచి కేరళకు బదిలీ చేశారు.. కారణాలు ఏంటో తెలియదు.. కానీ ముంబై నుంచి కేరళ కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయి వచ్చాడు .. ఇక్కడ వరకు బాగానే ఉంది ..కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.. రెండు రోజుల క్రితం నేవీ ముంబై ప్రధాన కేంద్రానికి తిరిగి ఈ అగ్ని వీరు వెళ్లారు.. ఈసారి ఏకంగా యూనిఫాంలో పోయాడు..రాత్రి సమయంలో వెళ్లిన ఈ నావి అధికారి ఉమేష్, సెంట్రీ పోస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ..డ్యూటీ చేంజ్ అయ్యే సమయం ..అక్కడ డ్యూటీలో ఉన్న గార్డ్ దగ్గరికి వెళ్లి తాను డ్యూటీలో చేరుతున్నానని నీకు రిలీవ్ ఇస్తున్నానని చెప్పాడు.. 10 గంటల సమయం లో అక్కడ ఉన్న గార్డ్ రిలీవ్ అయి పోయి...నావి అధికారి ఉమేష్ కి బాధ్యతలు అప్పగించాడు.

ఆ సమయంలో అతను దగ్గర ఉన్న ఒక ఇన్సాస్ వేపన్ తో పాటు 40 బుల్లెట్స్  కూడా ఉమేష్ కి అప్పగించి సదర్ అధికారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ..అయితే ఉమేష్  తో పాటు రాకేష్ ని కూడా తన వెంట తెచ్చుకున్నాడు ..రాకేష్ ని గేటు పక్కన నిలబెట్టాడు.. ఉమేష్ చేతిలోకి వెపన్ తోపాటు బుల్లెట్లు రాగానే అక్కడ అధికారుల కళ్ళు కప్పి పక్కనే.. అప్పటికే అక్కడ ఉన్న రాకేష్ కి వెపన్ ఇచ్చేశాడు. కొద్దిసేపు పాటు అక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నట్లుగా నటించాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమై పోయాడు.. నేవీ ప్రధాన కార్యాల యంలో కొట్టేసిన ఇన్సాస్ వెపన్ తో పాటు బుల్లెట్స్ ను తీసుకొని ఈ ఇద్దరు  చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కు  చేరుకున్నారు. 

అక్కడ ట్రైన్ ఎక్కేసి నేరుగా హైదరాబాద్ వచ్చాడు... హైదరాబాద్ నుంచి తన సొంత ఊరైన ఆసిఫాబాద్ ఎలుక పల్లి కి చేరుకున్నాడు.. తాను తెచ్చిన వెపన్స్  తమ్ముడికి  ఇచ్చి వేశాడు .. డ్యూటీలో ఉండాల్సిన గార్డు అక్కడ లేకపోవడంతో అధికారు లకు అనుమానం వచ్చింది.. వెంటనే రిలీవ్ అయిన అధికారిని పిలిపించారు. మరొకరికి డ్యూటీ బాధ్యతలు అప్ప గించి వెళ్ళిపోయా నని చెప్పాడు.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఉమేష్ గన్‌తో సహా వెళ్లిపోయి నట్లుగా విషయం బయటపడింది ..

దీంతో ఇది ఉగ్రవాద కుట్ర ఏదో జరగబోతుందని అనుమానం అధికారులకు వచ్చింది ..వెంటనే నేవీ ఇంటెలిజెన్స్ అధికారులతో  పాటు ముంబై ఏటిఎస్ , ఎన్‌ఐ రంగంలోకి దిగారు. చివరికి ఆసిఫా బాద్‌లో ఉమేష్ వెప్పన్‌తో సహా చిక్కాడు..తెలంగాణ పోలీసులు ఉమేష్, రాకేష్ ను పట్టుకొని ముంబై పోలీసులకు అప్పగించారు.. అయితే ఉమేష్ ఈ వెపన్ దొంగలించ డానికి అసలు కారణం ఏంటి? అనేదానిపై  అధికారులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టు లేదంటే ఉగ్రవాదులతో ఉమేష్ కి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుగుతుంది..


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu