రాష్ట్రంలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి
posted on Sep 10, 2025 8:43PM

రాష్ట్రంలో పలు చోట్ల పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం శివారులో వర్షం పడుతుందటంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు చేరారు. ఈ క్రమంలో పిడుగు పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి పార్వతమ్మ(22), సర్వేశ్(20), సౌభాగ్యమ్మ(40) అనే ముగ్గురు మృతి మరణించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గేదెలను కాస్తున్న మహేష్(26), మధిరలో వీరభద్రరావు(56) అనే మరో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.