హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల మోసం

 

హైదరాబాదులో ఫేక్ ఏపీకే యాప్‌ల మోసాలు వెలుగు లోకి వచ్చాయి... సైబర్ చీటర్స్ ఏ చిన్న అవకాశం దొరికినా  కూడా దానిని వాడేసు కుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్స్ వచ్చా యని.... లేదంటే మనీ ల్యాండరింగ్ జరిగిందని భయ పెడుతూ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్ప డ్డారు. చివరకు పహల్గావ్ టెర్రర్ ఘటనలను కూడా ఈ చీటర్స్ వాడేసుకున్నారు. ఇప్పుడు తాజా గా ఏపీకే యాప్ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి... ఓటీపీ లను లాగుతూ...  కొత్త నయా దందా కు తెరలేపారు. ఇలా ఫేక్ ఏపీకే యాప్ సృష్టించి... ఫోన్లను హ్యాక్ చేసి అనం తరం ఓటిపి తెలుసుకొని వారి బ్యాంకు గుల్ల చేస్తున్నారు.

ఆర్టీవో చలనా ఇలా నకిలీ ఏపీకే యాప్ లతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.హైదరాబాద్ నగరం లోని ముషీరాబాద్, చుడిబజార్, బోలా కపూర్‌ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు వేరువేరు పనుల కోసం ఏపీకే యాప్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో ఈ ముగ్గురు  మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అనంతరం సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి మీ ఫోన్ కి ఓటీపీ నెంబరు వచ్చిందని అది వెంటనే చెప్తే నీ పని అయిపోతుందని నమ్మబలిగారు..

అది నిజమని నమ్మిన ఆ ముగ్గురు వ్యక్తులు ఓటిపి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారి ఫోన్ కి బ్యాంకు నుండి ఓ మెసేజ్ వచ్చింది. అది చూసిన ముగ్గురు ఒక్కసారి గా షాక్ గుర య్యారు. ఈ ముగ్గురి బ్యాంకు ఖాతాల్లో ఉన్న 4.85 లక్షల రూపా యలు మాయమ య్యాయి. బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్ ను చూసిన ఈ ముగ్గురు వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. బ్యాంక్ అధికారులు మోసపోయారని పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. 

దీంతో ఆ ముగ్గురు లబోదిబో మంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎప్పుడూ అధికారిక స్టోర్‌ల నుండి మాత్రమే యాప్ డౌన్‌లోడ్ చేయండి..అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి... మోసం జరిగితే వెంటనే 1930 కాల్ చేయండి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విన్నపం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu