ఈ అగ్నిప్రమాదం అపశకునం?
posted on Sep 17, 2025 6:59PM
.webp)
అయితే అపశకునం అప్పుడే జరిగిందా? నిన్న మొన్న లండన్‌లో జరిగిన వలసవాదులు వెళ్లిపోవాలి కాన్సెప్ట్ కి బీజం అప్పుడే పడిందా? అంటే అవుననే తెలుస్తోంది. అది ఈస్ట్ లండన్ లోని ఇల్ఫోర్డ్. శ్రీసోరాథియా ప్రజాపతి కమ్యూనిటీ సెంటర్. ఇక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది శనివారం రాత్రి జరిగింది. గణేష్ చతుర్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ భవనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
ఈ ప్రమాదం గణపతి నిమజ్జన ఊరేగింపు టైంలో జరగడంతో హిందూ కమ్యూనిటీకి చెందిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాద సమయంలో లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రమాద స్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది.
కానీ, ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ వెంటనే వలసదారులు వెళ్లిపోవాలంటూ.. లండన్ లో గతంలో ఎన్నడూ లేనంతగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో అత్యంత భయంకరమైన ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం ద్వారా స్థానికంగా ఉండే వలసదారులను వెనక్కు పంపించేయాలన్న నినాదం ఊపందుకుంది. ఒక వేళ స్వామి ముందస్తుగానే అపశకునంగా ఈ అగ్నిప్రమాదం ద్వారా చూపించాడా? అన్న అనుమానం చెలరేగుతోంది. మరి చూడాలి తదనంతర పరిణామ క్రమాలు ఎలా ఉంటాయో. ఇందుకంటూ వీరు ప్రాయశ్చిత్తం ఏదైనా చేస్తారో లేదో తేలాల్సి ఉంది.