ఈవీఎంలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లుపై కేంద్ర ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు కూడా నిర్ణయించింది. సీరియల్ నెంబర్లను కూడా ప్రముఖంగా డిస్‌ప్లే చేయనున్నారు. తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనుంది.  దీని వల్ల ప్రజలు గుర్తులను చూసి పొరపాటు పడి తమకు నచ్చిన అభ్యర్థికి కాకుండా వేరేవారికి ఓటే వేసే అవకాశం తగ్గుతుందని భావిస్తోంది.

ఓటర్లకు మరింత సౌలభ్యం పెరిగేందుకు ఈసీఐ గత ఆరు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఈసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫోటోలు కలర్‌లో ముద్రిస్తారు. ఫోటో స్పేస్‌లో నాలుగింట మూడు వంతులు అభ్యర్థి ఫోటో ఉంటుంది. అభ్యర్థులు/నోటా సీరియల్ నెంబర్లు ఇంటర్నేషనల్ ఫారమ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్‌ పద్ధతిలో ప్రింట్ చేస్తారు. స్పష్టత కోసం అక్షరాకృతి పరిమాణం30గా, బోల్డ్‌లో ఉంటుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు 70 జీఎస్ఎం పేపర్‌పై ముద్రిస్తారు. శాసన సభ ఎన్నికల కోసం నిర్దిష్ట ఆర్జీబీ విలువలున్న పింక్ కలర్ పేపర్‌ను ఉపయోగిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu