హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
posted on Sep 17, 2025 8:26PM
.webp)
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి,మాదాపూర్, రాయదుర్గం, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, బండ్లగూడలో పలు ప్రాంతల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది.
ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫీక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులకు సూచించారు. మరోవైపు విజయవాడలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.