ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారదా ?

నీరసించిన సర్కారీ దవాఖనాలు ఆటకెక్కిన ప్రజా వైద్యానికి చికిత్స తప్పని సరి
రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలో ప్రజా ఆరోగ్యం ఉంటుంది. జిల్లా ఆసుపత్రులు 
ప్రాధమిక  ఆసుపత్రులు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు,అటు ప్రైవేటు పో టును భరించలేక, ఇటుప్రభుత్వ ఆసుపత్రుల  నిర్లక్ష్యం అడుగడుగునా సంమాన్యుడిని వెక్కిరిస్తోంది. రోగులను హీనంగా చీదరించుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల ను చూసి సామాన్యుడు వణికి పోతున్నారు. నగరంలో అదో ప్రధాన ఆసుపత్రి అక్కడికి మాన్యులు సామాన్యులు వస్తారు. అయితే మాన్యులు సామాన్యులు ఇక్కడ వేరేగా చూస్తారు.సామాన్యుడు అత్యవసర సేవకు వస్తే కార్పోరేట్ కు ఏమాత్రం తీసిపోని ధర ఒక్క ఐ సి యు లో బెడ్ దొరకాలంటే  ప్రహసనమే అంతా పెద్దల దయపై ఆధార పడుతుంది.అక్కడ పలుకు బడి ఉంటేనే బెడ్  లేదా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ ధారా రోజుకు 2౦,౦౦౦ కట్టాల్సిందే.సరే అని రోగులు ఒప్పుకున్నా  అక్కడికి అంటే ఐ సి యు కి వచ్చిమ రోగుల స్థితి కుక్క పాట్లే  బెడ్ ఎప్పుడు దొరుకు తుంది అంటే ఏమో అసలు మదగ్గర బెడ్స్ లేవు మీరు ఎవరికైనా చెప్పుకోండి కావాలంటే మీరు ఎప్పటి వరకైనా ఉండాల్సిందే మీరు ఓపిక తో ఉండాలి అంటారు సదరు వైద్యులు,మీరు కావాలంటే ఉస్మానియా, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకు పొండి.అంటూ ఒచ్చినా రోగులు ఆమెట్ల పక్కన అలాగే పడిగాపులు పడుతూ ఉండడం చూస్తే ఎవరికైనా కడుపు తరిక్కు పోతుంది.

అక్కడికి తీసుకు వాస్తే బతుకు తాదేమో అన్న ఆశతో వచ్చే రోగులకి చుక్కలు చూపిస్తారు సగటు సెక్యూరిటీ సిబ్బంది పో అక్కడికి ఫో ఇక్కడ ఉండద్దు.అంటూ అక్కడి నుంచి తోసేస్తారు. అక్కితో ఆగక లోపల మా వాళ్ళు ఉన్నారు ఒక్కసారి వెళ్లి వస్తాను అంటే ఒవీల్లేదు మీరు పోవద్దు ఏయ్ ఇక్కడ రా ఎక్కడపోతున్నావు మేరు ఇక్కడే ఉండాలి అక్కడ ఏమి జర్గుతుంది. అన్న ఆందోళన రోగి బంధువులలో ఉంటె వేమి చేయలేక బతుకు తాడో లేదో తెలీక వెక్కి వెక్కి ఏడుస్తూ గుడ్లలో నీరు ఉబికి వస్తున్న బయటపడని సగటు మధ్య తరగతి రోగి పరిస్థితి.చేతి వాడిని వదిలి కల వాడిని  పట్టుకున్నట్లు  ఇక్కడ ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక సరైన చాలినంత బెడ్స్ లేక కొట్టుకుంటున్న సామాన్యుడి గోడు వినపడదు,కనపడదు ప్రభుత్వానికి ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్లు వరంగల్ లో కొత్త ఆసుపత్రి కొత్తభవనం కట్టి అందరు ఇక్కడికే రావాలంటూ పెద్దలు సెలవిచ్చారు. అసలు ఐ సి యు లో ఉన్న బెడ్ల వివరాలు,ఆరోజు ఎన్ని ఫిలప్ అయ్యాయి.ఎన్ని ఖాళీ ఉన్నాయి అన్న వివరాలు తప్పనిసరిగా వివరించే బోర్డ్లు ఉండాలి,ఇక సర్జరీకోసం వచ్చా రోగులకు సైతం బెడ్లు కేటాయించాలంటే  అసలు అక్కడ ఏ వార్డులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నెలల తరువాత బెడ్స్ అందుబాటులో ఉంటాయి అన్న సమాచారం ఉండాలి.అసలు ఆసుపత్రులలో బెడ్లె లేకుంటే ఇక మూడో విడత ప్రమాదాన్ని తట్టుకోడానికి చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి రోగుల తాకిడిని తట్టుకోవడం ఎలా ప్రశ్నలకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అసలు సమాస్యకు పరిష్కారం తయారీ జరుగుతోందా అన్నది ప్రస్నార్ధకం గా మారింది.జనాభా అవసరాలు తీరని ఆసుపత్రులు అక్కడ వైద్యం చేయని సిబ్బంది ఎందుకు.వారికి జీతాలు ఎందుకు ప్రజలను చీదరించుకోదానికా?ప్రజా ఆసుపత్రులు ఉన్నట్టా లేనట్టా అన్నది అర్ధం కానీ సమస్య.అన్నీ ఉన్నా అది ఎదో అన్నట్లు ప్రజా ఆసుపత్రి కి రావాలంటే ప్రభుత్వ వైద్య సిబ్బంది పని తీరు మరాకుంటే ఎన్నికోట్లు ఇచ్చిన్న ప్రభుత్వ ఆసుపత్ర్హి ని ఐ సి యు లో ఉన్నట్లే అసలు ప్రాజా అసుపత్రులకే చికిత్స అవసరం.