చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే..


చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.


నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది.

ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది.


అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.

                                           *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu