ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఉసిరికాయ ఇలా తింటే మ్యాజిక్కే..!

 

ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

ఉసిరికాయ ఉడికించి..

ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు.

ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు..

రోగనిరోధక వ్యవస్థ..

ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

జీర్ణక్రియ..


ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.

 చర్మం,  జుట్టు..

ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది.

గుండె జబ్బులు..

ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.

కంటి చూపు..

విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎలా తినాలంటే..

ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.

      *రూపశ్రీ.

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

                         

Online Jyotish
Tone Academy
KidsOne Telugu