తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (సెప్టెంబర్ 16) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవి రాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.

శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేశారు. ఆలయం బయట టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించామని తెలిపారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అనీ, అందులో భాగంగానే ఆలయం అంతటా పవిత్ర సుగంధ ద్రవ్యాలతో శుద్ది నిర్వహించామనీ తెలిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాము.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం కల్పిస్తామన్నారు.   బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వివరించాచరు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా బ్రహ్మోత్సవాలు, భక్తుల సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లపై సమావేశమై చర్చించ నుందన్నారు.  లక్లలాది మంది భక్తులకు వాహన సేవలు తిలకించడంతో నాటె దర్శనం కూడా చేసుకునే అవకాశం కల్పిస్తామని అనిల్ కుమార్ షిండే తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu