భక్తసంద్రంగా మారిన ఖైరతాబాద్

ఖైరతాబాద్ లో ఉన్న బడా గణేష్ దర్శనానికి  గురువారం(సెప్టెంబర్ 4)  రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి  ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. దాదాపు  28 లక్షల మంది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.  ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.   ఒకవైపు  భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలి వస్తుంటే... మరోవైపు గణేష్ నిమజ్జనానికి పోలీస్  ఉన్నతాధి కారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం (సెప్టెంబర్ 5)  వినాయక నిమజ్జనం జరగనుంది.   ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంశనివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం టర్గెట్ గా పెట్టుకుంది.  

కాగా, జంటనగరాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా దాదాపు 302 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్ర జరుగుతుంది. ఇందు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక జీహచ్ఎంసీ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. 30 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహించనుంది. అలాగే 169 యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దింపుతున్నాయి.  ఇక వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరురువుల, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేశారు. ఇక పోతే 134 క్రేన్లు, 239 మొబైల్ క్రేన్లు రెడీ చేశారు. ఇక హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను రెడీ చేశారు. శానిటేషన్ కోసం 14 వేల 486 మంది సిబ్బందిని నియోగించారు.  శనివారం (సెప్టెంబర్ 6) 50 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu