కేరళను కుదిపేస్తున్న పరువు హత్య

 

కేరళలో ఆ మధ్య కెవిన్‌ అనే యువకుడు, నీను అనే అమ్మాయిని రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులది మతాంతర వివాహమే. అయినా కూడా తమ కూతురు ప్రేమ పెళ్లిని చేసుకుంటే తట్టుకోలేకపోయారు. నానాగొడవా చేశారు. చివరికి వారి బంధువులంతా కలిసి ఆ యువకుడిని చంపేశారు. ఇప్పుడా హత్య కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అమ్మాయి తరపు వారంతా అధికార పక్షం వారు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువకుడి హత్యకు సంబంధించిన కేసుకుని రిజిస్టర్‌ చేసుకునేందుకు కూడా పోలీసులు నిరాకరించడంతో... మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. పరిస్థితి చేయి దాటి పోవడంతో ప్రభుత్వం సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకుంది. ఈ కేసుని పరిశోధించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu