ఇక చాలు.. పాలనపై దృష్టి సారించండి...

 

ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వంపై.. మోడీపై విమర్శలు గుప్పించిన నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కర్ణాటక ప్రభుత్వంపై కామెంట్లు విసిరారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రి పదవుల కేటాయింపు విషయంలో ఇప్పటి వరకు ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, మంత్రివర్గం ఇంకా కొలువుదీరలేదు. నేడో, రేపో కేబినెట్ బెర్త్‌లను ఖరారు చేసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలోనే రోజులు గడుస్తున్నా ఇంకా పాలనపై దృష్టి సారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైందని, ఇక పాలనపై దృష్టి సారించాలని... ప్రజలు వారి పాలనను చూడాలనుకుంటున్నారని, కాబట్టి త్వరగా ఆ పనేదో చేయాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu