నేపాల్ ప్రజలకు క్షమాపణ చెప్పిన సుష్మా స్వరాజ్‌..

 

నేపాల్‌ ప్రజలలో కూడా చాలామంది హిందువులు ఉండవచ్చు. వారి మూలాలు భారతదేశంలో ఉండవచ్చు. అంతమాత్రాన ఆ ప్రజలు భారతీయులు అయిపోరు కదా! నేపాల్‌ ఓ స్వతంత్ర దేశం. తనకంటూ ప్రత్యేకత ఉన్న ప్రాంతం. అందుకనే సుష్మాస్వరాజ్ అన్న ఓ మాట అక్కడ తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నేపాల్‌ను సందర్శించిన సమయంలో ‘మోదీ జనక్‌పురి (నేపాల్‌)లో ఉన్న లక్షలాది భారతీయులతో మాట్లాడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు సుష్మా. నేపాల్ ప్రజలను కూడా భారతీయులుగా పేర్కోనడంతో అక్కడి ప్రజలు భగ్గుమన్నారు. దాంతో పొరపాటు జరిగిపోయిందని నాలుక కరచుకుని మళ్లీ నేపాల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు సుష్మా!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu