జమ్మూ కాశ్మీర్ లో ఉపఎన్నికలు.. రెండు పాఠశాలలకు నిప్పు
posted on Apr 10, 2017 12:11PM

జమ్మూ కాశ్మీర్ లో ఉపఎన్నికలు జరిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అనంత్‌నాగ్‌లో రెండు పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఎన్నికల రోజున షోపియాన్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటుచేసే రెండు పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పటించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.