ఢిల్లీలో జగన్ కు చేదు అనుభవం...
posted on Apr 10, 2017 1:04PM
.jpg)
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేయడానికి పలు పెద్దలను కలుస్తున్న సంగతి కూడా విదితమే. అయితే అక్కడ కూడా జగన్ కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాష్ట్రపతితో పాటు అరుణ్ జైట్లీ, ములాయం సింగ్ యాదవ్, వామపక్ష నేతలను కలిశారు. అయితే కొంతమంది మాత్రం జగన్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట. దీంతో జగన్ వెనుతిరిగారట. కాగా జగన్ పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకోగా.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండని ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ కు సూచించారట. అయినా కూడా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.