జగన్ ను టార్గెట్ చేయక ఇంకెవరిని చేయాలి...?
posted on Apr 10, 2017 11:46AM

అధికార పార్టీ ఉన్న నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలపై, ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీలో ఉన్న నేతలపై విమర్శలు చేయడం కామన్. అయితే ఇప్పుడు దీనిపై కేశినేని నాని స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను ప్రతివిషయంలోనూ వైసీపీ అధినేత జగన్ నే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్... ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తుంటారని...ఈ నేపథ్యంలో, అన్ని విషయాలకు సంబంధించి ఆయనకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని... అంతేకాదు.. ఏపీ శాసనసభలో కాంగ్రెస్ లేదు, వామపక్షాలు లేవని... ఇలాంటి పరిస్థితిలో, సభలో ఉన్న ఏకైక విపక్షానికి చెందిన పార్టీ అధినేత జగన్ గురించే మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. జగన్ నే టార్గెట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.