సత్యంబాబుకు కలెక్టర్ సాయం..

 

అయేషా మీరా హత్య కేసులో దాదాపు 8 ఏళ్లు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషి అని తేల్చుతూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఇప్పుడు తాజాగా  ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ను సత్యంబాబు కలిశాడు. ఈ నేపథ్యంలో పేదవాడినైన తనకు జీవనాధారం కల్పించాలని... తన సోదరికి ఏఎన్ఎం ఉద్యోగాన్ని కల్పించాల్సిందిగా విన్నవించాడు. దీనికి స్పందించిన కలెక్టర్.. తన సోదరికి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పారు. అంతేకాదు  అతనికి ఇల్లు కూడా మంజురూ చేశారు. దానికి సంబంధించిన ఆదేశాలను కూడా కలెక్టర్ జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu