హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య
posted on Oct 14, 2025 4:31PM

హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాతర్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 3 పేజీల సూసైడ్ నోట్‌లో తన చావుకు పూరన్ కుమారే కారణమని పేర్కొనడం సంచలనంగా మారింది. సందీప్ రోహ్‌తక్‌లోని సైబర్ సెల్‌లో పనిచేశారు. కాగా తనను వేధిస్తున్నారని 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల రాసి పూరన్ పూరన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఏఎస్ఐ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్‌తో పాటు ఓ వీడియోను కూడా రికార్డ్ చేసిన సందీప్ కుమార్, ఐపీఎస్ పూరణ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పనిచేస్తున్న సందీప్, పూరణ్ కుమార్ జాతి వివక్షతో వ్యవహరించారని, నిజాయితీ గల అధికారులను పక్కనబెట్టి అవినీతిపరులను ప్రోత్సహించారని ఆరోపించారు.అంతేకాదు, ఫైళ్లను బ్లాక్ చేసి, పిటిషనర్లను ఫోన్ చేసి మానసికంగా హింసించేవారని, బదిలీల కోసం మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించేవారని సంచలన ఆరోపణలు చేశారు.
పూరణ్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, తనపై వచ్చిన ఫిర్యాదుల ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సందీప్ పేర్కొన్నారు.ఇక తక్కువ వ్యవధిలోనే హర్యానా పోలీస్ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.