ఆడవేశం కట్టి స్నేహితుడి ఇంట్లో చోరీ
posted on Sep 21, 2025 11:29AM

అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరకు స్నేహితుడి ఇంట్లోనే దొంగత నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. లింగంపల్లి కి చెందిన హర్షిత్, శివరాజు కొడుకు ఇద్దరు మంచి స్నేహి తులు... అయితే హర్షిత్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా లోన్ యాప్ ద్వారా డబ్బులను అప్పు తీసుకున్నాడు. అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఒకవైపు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తూ ఉండగా మరోవైపు అప్పులు తీర్చే మార్గం కనిపించక హర్షిత్ దొంగతనం చేయా లని నిర్ణయించుకున్నాడు.
కానీ ఇలా చేయాలి ఎప్పుడు చేయాలి? ఎవరింట్లో చేయాలి? అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలోశివరాజ్ కుటుంబంతో నిజామాబాద్ కెళ్లగా.. ఈ విషయం శివరాజ్ కొడుకు లింగంపల్లి సిసి సమర టెక్నిషియన్ హర్షిత్ కి చెప్పాడు.. దీంతో హర్షిత్ పోలీసుల చేతికి కానీ మరెవరికి కానీ అనుమానం కలగకుండా ఆడవేషం వేసుకుని దొంగతనానికి బయలుదేరాడు. బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కు చెందిన శివరాజ్ ఇంట్లోకి ఈనెల16న వెళ్లి శివరాజ్ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి 6.75తులాల బంగారం,1.10లక్షల నగదు చోరి చేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.
శివరాజ్ కుటుంబ సభ్యులు ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా... తాళం పగిలిపెట్టి ఉండడంతో దొంగలు పడ్డట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని హరీష్ ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో ఈ దొంగతనం వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. దీంతో పోలీసులు వెంటనే హరీష్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. లోన్ ఆప్ అప్పులు తీర్చేందుకు హరీష్ ఆడవేషంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ అయింది. హరీష్ వద్ద నుండి 6.75తులాల బంగారం, 85వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్ కు తరలించారు..