ట్రంప్ మార్క్... మేక్ భారత్ గ్రేట్ అగైన్ స్టార్టయ్యిందా!?
posted on Sep 21, 2025 11:38AM

ఏ మాటకామాట.. ట్రంప్ కేవలం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయడం లేదు. ఆల్ కంట్రీస్ మేక్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడు. భారత ప్రభుత్వం యుగయుగాలుగా ప్రతిభను నిలుపుకోవడంపై దృష్టి పెట్టలేకపోయిందన్న మాట కఠిక వాస్తవం... దీంతో అందరూ కలసి అందమైన జీతం కోసం అమెరికా బాట పట్టారు.
బేసిగ్గా ప్రపంచంలోని టాప్ మోస్ట్ లలో అమెరికా శాలరీ ఒకటి. ఎందుకంటే ఇంగ్లండ్ హౌస్, ఫ్రెంచ్ వైన్, చైనీస్ వైఫ్, ఇండియన్ ఆర్మీ, అమెరికన్ శాలరీ ద బెస్ట్ గా చెబుతారు. దీంతో బెస్ట్ శాలరీ కావాలనుకున్న వారు ఏదో ఒకటి చేసి అమెరికా చెక్కేసేవారు. దీంతో అమెరికాలో భారతీయ మేధో సంపత్తి భారీ ఎత్తున పెరిగిపోయింది.
ఇప్పటికే మన వాళ్లు అక్కడ స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ లో టాపర్స్. వారికి ఇక్కడ రిజర్వేషన్ల రూపంలోనో లేక లోకల్ పాలిటిక్స్ కారణంగానో తగిన గౌరవనీయమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవి కావు. అదే అమెరికాలో అయితే సాదా సీదా టాలెంట్ కి కూడా డాలర్ల వేట చేయడం సులువు. అమెరికాలో ఒక్క డాలర్ ఇండియాలో 88 రూపాయలు కావడంతో జనం పొలోమని అమెరికా బాట పట్టడం మొదలైంది.
దేశ స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే నెహ్రూ తీస్కున్ డెసిషన్ కి భారత్ అభివృధ్ధి నానాటికీ దిగజారడం మొదలైంది. ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్లు కంట్రీ ఫస్ట్ నిర్ణయం తీస్కుంటే, అదే భారత్ లో నెహ్రూ పబ్లిక్ ఫస్ట్ డెసిషన్ తీస్కున్నారు.
దీంతో అక్కడ దేశం కోసం మనిషి- తన సర్వస్వం త్యాగం చేయడం మొదలుకాగా.. అదే ఇక్కడ మనిషి కోసం దేశం- సర్వస్వం కోల్పోయే వరకూ వచ్చింది పరిస్థితి. దీంతో ఆనాడు గొప్పగా ఉన్న రూపాయ కాస్తా, డాలర్ ముందు మోకరిల్లడం మొదలైంది. ఇప్పుడు చూస్తే డాలర్ ఆకాశమంత ఎత్తులో ఉంటే రూపాయ నేల చూపులు చూస్తోంది. దీనంతటికీ కారణం ఆయా కాలాల్లో ఆయా ప్రభుత్వాలు తీస్కున్న నిర్ణయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు.
ఇప్పటికీ అమెరికాలో ఏదీ నిబంధనలకు విరుద్ధంగా జరగదు. అదే ఇక్కడ వయోలేషన్స్ ఒక రేంజ్ లో సాగుతుంటాయ్. దీంతో టాలెంట్ ఇక్కడ ఉండి మనమేం సాధించలేం అన్న కోణంలో విసిగి వేశారి.. యూఎస్ బాట పట్టింది యువత. అక్కడకి మన టాలెంట్ చేరుతూ రావడంతో పాటు గణనీయంగా టాక్స్ పేయర్స్ సంఖ్య పెరిగింది.
అమెరికాలో ట్యాక్స్ పే చేసే వారిలో ఇండియన్స్ ది ఒకటిన్నర శాతం. అదే సొమ్ము ఇక్కడ సంపాదించి- ఇక్కడ కడితే అదెంత ఉపయోగపడుతుంది? ఎందుకంటే భారత్ లో టోటల్ టాక్స్ పేయర్స్ శాతం కేవలం 2 శాతం మంది మాత్రమే అంటున్నాయి గణాంకాలు. దీన్నిబట్టీ చూస్తే మన వాళ్లు ఆ దేశం కోసం ఎంత చెల్లిస్తున్నారో.. ఆ మొత్తం మన దేశం ఏ స్థాయిలో కోల్పోతోందో ఊహించుకోవచ్చు.
ఒకప్పుడు రిజర్వేషన్ల కారణంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశాలు రావడం, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఏ ఉద్యోగం రాక పోవడంతో విరక్తి చెందిన యువత ఇక్కడి నుంచి అమెరికా వలస వెళ్లడం మొదలైంది. ఆ తర్వాతి కాలంలో ఇక్కడ పని చేయడానికి తగిన టాలెంటే లేక పోయేదన్న మాట వినవచ్చింది. మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూమ్ రావడంతో .. ఇండియాలో గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. దీంతో అమెరికా లోని హెచ్ వన్ బీ వీసా హోల్డర్స్ లో 70 పర్సంట్ వరకూ మన వాళ్లే ఉంటూ వచ్చారు.
ప్రస్తుతం ట్రంప్ తీస్కున్న హెచ్ వన్ బీ ఫీజు లక్ష డాలర్లకు పెంపు అనే ఈ డెసిషన్ కారణంగా హైలీ టాలెంటెడ్ మాత్రమే అక్కడికి వెళ్లడం మాత్రమే కాకుండా.. ఇక్కడే మిగిలి పోయే వారు తమ తమ ఉదర పోషణార్ధం తమ తమ టాలెంట్ చూపించడం మొదలు పెడతారు. దీంతో భారత్ తిరిగి వికసించడం ప్రారంభమవుతుంది. ఇప్పటికే స్టార్టప్ ట్రెండ్ ఒకటి మొదలైంది. దానికి తోడు ఇక్కడ కూడా మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటివి పురుడు పోసుకుని చాలా కాలమైంది.
కాబట్టి భారతీయ యువత వచ్చే రోజుల్లో తమ అమెరికా ప్రయాణాలు పక్కన పెట్టి, భారత్ లో రాణించడం ఎలా? అన్న ప్రాక్టీస్ చేసినా చేస్తారు. వారికంటూ మంచి భవిష్యత్ నిర్మాణం జరగటంతో పాటు దేశ ఫ్యూచర్ కూడా మెరుగుపడే అవకాశం కనుచూపు మేర కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ట్రంప్ కేవలం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాత్రమే కాదు.. మేక్ ఎవ్రీ కంట్రీ మేక్ అగైన్, మరీ ముఖ్యంగా భారత్ మేక్ అగైన్ అనే కాన్సెప్ట్ తీస్కున్నట్టు తెలుస్తోందని చమత్కరిస్తారు కొందరు విదేశీ వ్యవహారాల నిపుణులు.