ఏపీ రెరా ఛైర్మన్‌గా శివారెడ్డి బాధ్యతలు

 

ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ (రెరా) కొత్త ఛైర్మన్‌గా ఎ. శివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రెరా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ గంగారం ఆయనను ప్రమాణం చేయించారు. అదే కార్యక్రమంలో రెరా సభ్యులుగా నియమితులైన మంత్రిరావు వెంకటరత్నం, దామచర్ల శ్రీనివాసరావు, మేరువ వెంకటేశ్వర్లు, జజ్జవరవు కులదీప్‌లకు కూడా ఛైర్మన్ శివారెడ్డి ప్రమాణం చేయించారు.

తరువాత పలువురు నాయకులు ఛైర్మన్‌ శివారెడ్డి, సభ్యులను సత్కరించారు. రెరా బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడం ఆనందకరమని శివారెడ్డి తెలిపారు. భవన నిర్మాణ రంగం కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా, ఈ రంగం అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పారు. త్వరలో సభ్యులందరితో చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu