హైదరాబాద్‌లో మహిళల మృతదేహాలు కలకలం

 

హైదరాబాద్ నగరంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మహిళ మృతదే హాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి... ఓ మహిళ మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేయగా మరో మహిళ మృతదేహాన్ని సంచిలో పెట్టుకొచ్చి రైల్వేస్టేషన్ వద్ద వదిలి వేసి వెళ్లారు. ఈ రెండు ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో ఓ మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది... డెడ్ బాడీని చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. 

హుటా హుటిన పోలీసులు క్లూస్టింగ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద కి మహిళను తీసుకువెళ్లి హత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.. ఈ యువతి వయసు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసుల అంచనా... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు... ఈ నేపథ్యంలోని పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ.... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు...

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పురా డెడ్ బాడీని చూసిన స్థానికులు సమాచారం అందించారని రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.... వెంటనే ఘటనాస్థ లానికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించాం.. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానిస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్నారు. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉంది.. మర్డర్ జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చునని ఇన్స్పెక్టర్ అన్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

 డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి... అనంతరం హత్య చేసినట్టు అనుమా నిస్తున్నాం. అంతేకాకుండా మేము స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. క్లూజ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్, అలానే  ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.అసలు మృతురాలు ఎవరు.. ఆమెను ఎవరు హత్య చేశారు...? అనే కోణంలో దర్యాప్తు కొనసాగించామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు...

ఇదిలా ఉండగా మరోవైపు చరపల్లి పోలీస్టేషన్ పరిధిలో ని రైల్వే స్టేషన్ సమీపంలో గోనే సంచిలో మహిళా మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. చర్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గుర్తుతెలియని కొందరు దుండగులు చర్లపల్లి రైల్వే స్టేషన్ గొడ వద్ద మహిళ మృతదేహం పడేసి వెళ్ళిపోయారు. సంచిలో మృతదేహం కనిపించడంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దుండగుల కోసం వేట కొనసాగించారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu